: ఫలితాలపై పార్టీ సమీక్షించుకోవాలి: వీహెచ్
పాలేరు, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అసోం ఎన్నికల్లో వచ్చిన ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వీహెచ్ అభిప్రాయపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా లభించిన ఫలితాలపై వాస్తవాలు చర్చించుకోవాలని అన్నారు. అలా చర్చించుకున్నప్పుడే పార్టీకి మనుగడ ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. మోదీ అధికారం చేపట్టిన రెండేళ్లలో చేపట్టిన పనులను బీజేపీ గొప్పగా చెప్పుకుంటోందని ఆయన చెప్పారు. పదేళ్లలో కాంగ్రెస్ చేపట్టిన పనులను చెప్పుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. పదేళ్లపాటు కాంగ్రెస్ చేసిన అభివృద్ధి కానరాకుండా, మరుగున పడేలా మోదీ ప్రచార వ్యూహాలను అనుసరిస్తూ పార్టీని దెబ్బతీస్తున్నారని ఆయన తెలిపారు.