: తమిళనాడులో ధనబలం, అవినీతి కీలక పాత్ర పోషించాయి: వామపక్ష నేత ఏచూరి
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ధనం, అవినీతి కీలక పాత్ర పోషించాయని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, అవినీతి యూడీఎఫ్ ని కేరళ ఓటర్లు ఓడించారన్నారు. ఎల్డీఎఫ్ మేనిఫెస్టోను ప్రజలు ఆదరించారని, అందుకే పట్టం కట్టారని అన్నారు. అసోంలో కాంగ్రెస్ పై ఉన్న వ్యతిరేకత బీజేపీకి బాగా కలిసొచ్చిందని, బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలలో బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందని ఆరోపించారు. ప్రజా తీర్పును స్వాగతిస్తున్నామని, తమ పార్టీ వైఫల్యంపై విశ్లేషించుకుంటామని సీతారాం ఏచూరి పేర్కొన్నారు.