: కేసీఆర్ తో కుమ్మకై దొంగ దీక్షలు చేస్తున్న జగన్: ఏపీ మంత్రి రావెల


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కుమ్మక్కై దొంగ దీక్షలు చేస్తున్నారని ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ కు చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీ లేదా తెలంగాణలో దీక్ష చేయాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం బచావత్ ట్రైబ్యునల్ ను పాటించాలన్నారు. రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కష్టపడుతుంటే, మరోవైపు జగన్ దొంగదీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News