: కేరళలో సీపీఐ(ఎం) నేత విజయోత్సవ ర్యాలీలో బాంబు దాడి... ఒక కార్యకర్త మృతి


కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన సీపీఎం నేత పినరాయి విజయన్ విజయోత్సవ ర్యాలీపై బాంబు దాడి జరిగింది. ఈ సంఘటనలో కన్నూరు జిల్లాకు చెందిన సీపీఐ(ఎం) కార్యకర్త ఒకరు చనిపోగా, పలువురు గాయపడ్డారు. ‘మనోరమ’ ఆన్ లైన్ ప్రకారం, ధర్మాడమ్ నియోజకవర్గంలో ఈ విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. మృతి చెందిన వ్యక్తిని కార్యకర్త రవిగా గుర్తించినట్లు ‘మనోరమ’లో పేర్కొన్నారు. కాగా, బీజేపీ, సీపీఎం కార్యకర్తల మధ్య ఘర్షణలు తలెత్తడంతోనే ఈ సంఘటన జరిగినట్లు సమాచారం. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News