: రెచ్చిపోయిన ‘తృణమూల్’ కార్యకర్తలు... సీపీఐ(ఎం) కార్యాలయానికి నిప్పు


పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో విజయం సాధించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కొంతమంది ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతుండగా, మరికొందరు విధ్వంసానికి పాల్పడ్డారు. అసన్సోల్ లో ఉన్న సీపీఐ(ఎం) కార్యాలయంలోని వస్తువులను ధ్వంసం చేసి నిప్పుపెట్టారు. ఈ సంఘటనలో ఫర్నీచర్ దగ్ధమై పోయింది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే, కార్యాలయంపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడికి పాల్పడుతున్న సమయంలో పోలీసులు అక్కడే ఉన్నారని, అయితే ప్రేక్షక పాత్రపోషించారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News