: హోర్డింగ్ ఎక్కి రెండు గంటలుగా ఇద్దరు విద్యార్థుల నిరసన.. ఫోన్‌లో విద్యార్థులతో మాట్లాడిన ఆర్.కృష్ణయ్య
హైదరాబాద్‌లోని సీఎం క్యాంప్ ఆఫీస్ ఎదుట ఉన్న హోర్డింగ్‌ను ఎక్కి రెండు గంటలుగా ఇద్దరు విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అగ్రికల్చరల్ వొకేషనల్ కోర్సులు చదివిన వారికి కూడా ఏఈఓ పోస్టుల్లో అవకాశం కల్పించాలని విద్యార్థులు ప్రభాకర్, చైతన్య డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతానికి చేరుకున్న బీసీ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఫోన్‌లో ఆ విద్యార్థులతో మాట్లాడుతున్నారు. వారు కిందికి దిగేలా ప్రయత్నం చేస్తున్నారు. విద్యార్థులు హోర్డింగ్ ఎక్కడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అక్కడి రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.