: ద్రవిడ్ కే నా ఓటు...జహీర్ కూడా కావాలి: హర్భజన్ సింగ్


టీమిండియాకు బెస్ట్ కోచ్ గా ఉండేందుకు అర్హతలున్న వ్యక్తి అంటూ దేశవిదేశీయులంతా రాహుల్ ద్రవిడ్ పేరునే చెబుతున్నారు. తాజాగా టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్ సరైన వ్యక్తి అని అగ్రశ్రేణి స్పిన్నర్ హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. అయితే, బౌలింగ్ కోచ్ గా జహీర్ ఖాన్ ను నియమించాలని పేర్కొన్నాడు. ఈ ఇద్దరి అనుభవం టీమిండియాకు ఎంతో ఉపయోగపడుతుందని భజ్జీ అభిప్రాయపడ్డాడు. 'మరి కోహ్లీ, వెట్టోరీ అంటున్నాడు కదా?' అని అడిగితే...ఆయన కూడా టాలెంటెడేనని తెలిపాడు. ఈ సందర్భంగా కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు. ఫిట్ నెస్ కాపాడుకుంటూ కోహ్లీ ఆడుతున్న తీరు అద్భుతమని చెప్పాడు. కోహ్లీలోని గెలవాలన్న తపన చూస్తే తనకు ముచ్చటేస్తుందని తెలిపాడు. ఐపీఎల్ వల్ల వరల్డ్ టీ20కి నష్టం జరుగుతుందని వార్తలు రావడం తనను కలచివేసిందని భజ్జీ వెల్లడించాడు. ఐపీఎల్ సీజన్ 9లో నాకౌట్ కి ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాదు, కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు చేరుకుంటాయని తెలిపాడు.

  • Loading...

More Telugu News