: విమానాన్ని కూల్చేసింది ఉగ్రవాదులే: ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండే అనుమానం


ఈ ఉదయం ఈజిప్టులో కనిపించకుండా మాయమైన విమానాన్ని ఉగ్రవాదులు కూల్చేసినట్టు తమకు అనుమానాలున్నాయని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే వ్యాఖ్యానించారు. ఈ అనుమానాలను తీసిపారేయలేమని, ప్రస్తుతానికి ఆ విమాన ప్రయాణికుల కుటుంబాల గురించి మాత్రమే ఆలోచిస్తున్నామని ఆయన అన్నారు. పారిస్ నుంచి కైరోకు బయలుదేరిన ఎంఎస్ 804 విమానానికి, గ్రీక్ ద్వీపం వద్ద ట్రాఫిక్ కంట్రోల్ టవర్ తో సంబంధాలు తెగిపోగా, ఆపై కనిపించకుండా పోయింది. ఈ విమానం సముద్రంలో కూలి ఉండవచ్చని భావిస్తున్న మూడు దేశాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఎయిర్ పోర్టులో తనిఖీలు సరిగ్గా జరగలేదని తేలడంతో ప్యారిస్ ఎయిర్ పోర్టులో పనిచేస్తున్న పలువురిని తొలగించినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News