: కోఠి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో కల్తీ రక్తం సరఫరా
హైదరాబాదు, కోఠి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో మరో ఘటన వెలుగులోకొచ్చింది. అక్కడి సిబ్బంది నిర్వాకంపై ఇటీవల అనేక ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రతీ విషయానికి డబ్బులు వసూలు చేస్తున్నారని స్థానికులు ఎన్నో ఆరోపణలు గుప్పించారు. ఈ క్రమంలో, అక్కడి సిబ్బంది నిర్వాకం మరొకటి బయటపడింది. కోఠి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో కల్తీ రక్తం సరఫరా చేస్తున్న ఘటన వెలుగులోకొచ్చింది. వివిధ రక్తనిధి కేంద్రాల పేర్లతో ఏడాది కాలంగా కల్తీ రక్తాన్ని అమ్ముతోన్న ఒప్పంద ఉద్యోగి నిర్వాకం బయటపడింది. రక్తం ప్యాకెట్ల సరఫరా చేస్తోన్న వ్యక్తి పేరు నరేంద్ర అని తెలుస్తోంది. తమ పేర్లతో అధిక డబ్బులకి రక్తాన్ని అమ్ముకుంటున్నాడంటూ పలు రక్తనిధి కేంద్రాల ప్రతినిధులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు.