: ఒకే రోజు మూడు శుభవార్తలు ... సీఎం కేసీఆర్ హుషారు
ఒకే రోజున మూడు శుభవార్తలతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా హుషారుగా ఉన్నారు. అందులో మొదటిది...ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన యాపిల్ సంస్థ డిజిటల్ మ్యాపింగ్ సెంటర్ ను హైదరాబాద్ లో ప్రారంభించడం. రెండోది... ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు భారీ విజయాన్ని సాధించడం. మూడోది... గతంలో ఎన్నడూ లేని విధంగా, ఏ పార్టీ సాధించని విధంగా ఈ ఎన్నికలో టీఆర్ఎస్ 45 వేల కు పైగా రికార్డు మెజార్టీని సాధించడం... కాంగ్రెస్ కు కంచుకోటను టీఆర్ఎస్ కైవసం చేసుకోవడం వంటి సంఘటనలతో కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆనందోత్సాహాల్లో ఉన్నారు.