: అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా ఆమె బతికింది!


క‌ర్నాట‌క‌లోని మైసూరులో అందర్నీ ఆశ్చ‌ర్యంలో ముంచెత్తే సంఘ‌ట‌న చోటు చేసుకుంది. 59ఏళ్ల పద్మాబాయ్ అనే మ‌హిళని ఇక‌ చ‌నిపోయింద‌ని భావించి, చుట్టాలంద‌ర్నీ పిలిచి అంత్య‌క్రియ‌ల‌కు ఏర్పాటు చేస్తుండ‌గా ఆమె శ్వాస ఒక్కసారిగా ఆడింది. దీంతో అక్క‌డి వాళ్లంద‌రూ అవాక్క‌యిపోయారు. పద్మాబాయ్ నాలుగు రోజుల ముందు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండగా ఆమెను కుటుంబ సభ్యులు ఆసుప‌త్రికి తరలించారు. వైద్యులు ఆమెకు వెంటిలేటర్ పై చికిత్స అందజేశారు. అనంతరం ఆమె చనిపోయిందని వైద్యులు చెప్పడంతో పద్మాబాయ్ ని ఇంటికి తీసుకెళ్లిన ఆమె కుటుంబ స‌భ్యులు అంత్య‌క్రియ‌ల‌కు ఏర్పాట్లు చేశారు. ఆమె బౌతిక కాయాన్ని తరలించే సమయంలో ఒక్కసారిగా ఆ మ‌హిళ శ్వాస పీల్చుకుంది. దీంతో అక్క‌డి వాతావ‌ర‌ణం మారిపోయింది. ఆ ఆశ్చర్యం నుంచి వెంటనే తేరుకుని, ఆమెను ఆసుప‌త్రికి త‌ర‌లించి వైద్యం చేయిస్తున్నారు. చనిపోయిందనుకున్న పద్మాబాయి శ్వాస తిరిగి ఆడడంతో బంధువులంతా ఆనందం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News