: పశ్చిమ బెంగాల్ కౌంటింగ్ పూర్తి... తుది ఫలితాలు
మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగిన పశ్చిమ బెంగాల్ లో కౌంటింగ్ పూర్తయింది. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఎవరికీ అందనంత ఎత్తున నిలిచి 211 చోట్ల విజయం సాధించింది. సాధారణ మెజారిటీ కన్నా ఎంతో ఎత్తున ఆమె నిలవడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ 44 స్థానాల్లో విజయం సాధించగా, వామపక్ష పార్టీలు 32 స్థానాల్లో విజయ బావుటాను ఎగురవేశాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఎంతమాత్రమూ పోటీ ఇవ్వలేని రీతిలో చతికిలబడి 3 సీట్లకు పరిమితం కాగా, మరో నాలుగు స్థానాల్లో ఇతరులు విజయం సాధించారు. కాగా, ఈ నెల 27న బెంగాల్ కు రెండోసారి ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.