: ‘అమ్మ’ జయలలిత సెంటిమెంట్ పండింది!


1989 తర్వాత తమిళనాడులో వరుసగా రెండోసారి విజయదుందుభి మోగించిన అన్నాడీఎంకే అధినేత్రి ‘అమ్మ’ జయలలితకు ‘సెంటిమెంట్’ ఎక్కువేనట. ఆమెకు ‘6’ సంఖ్య సెంటిమెంట్ బాగా కలిసొస్తుందట. అందుకేనేమో, జయలలిత తన పార్టీ మేనిఫెస్టో ప్రకటించింది 6వ తేదీన. ఆదివారం నుంచి లెక్కిస్తే వారంలో ఆరో రోజయిన శుక్రవారం నాడే ఆ మ్యానిఫెస్టోను ప్రకటించారు. ఎన్నికల నిమిత్తం ప్రజలకిచ్చిన ప్రధాన హామీల సంఖ్య కూడా ఆరే. కేరళలోని ఒక జ్యోతిష్కుడిని ఆమె తరచుగా సంప్రదిస్తుంటారని అంటారు. కాగా, ఇప్పటివరకు ఐదుసార్లు ముఖ్యమంత్రి పదవిని జయలలిత చేపట్టారు. ఇప్పుడు, ఆరోసారి సీఎంగా ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు.

  • Loading...

More Telugu News