: పుదుచ్చేరిలో కౌంటింగ్ పూర్తి... తుది ఫలితాలు
30 స్థానాలున్న పుదుచ్చేరి రాష్ట్రంలో ప్రభుత్వం స్థాపించడానికి అవసరమైన మెజారిటీని కాంగ్రెస్, డీఎంకే కూటమి సాధించింది. కొద్దిసేపటి క్రితం పుదుచ్చేరి ఓట్ల లెక్కింపు పూర్తయింది. కాంగ్రెస్ కూటమి 17 స్థానాల్లో విజయం సాధించింది. ఏఐఎన్ఆర్సీ 8 స్థానాల్లో, ఏఐఏడీఎంకే 4 చోట్ల విజయం సాధించగా, ఇతరులకు ఒక్క స్థానం దక్కింది. తమిళనాడులో మాదిరిగానే విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకే పుదుచ్చేరిలోనూ ఖాతా తెరవడంలో విఫలమైంది. ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ నేతగా, పుదుచ్చేరిని మరోసారి ఏలాలని భావించిన ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి ఇక మాజీ కానున్నారు.