: నిర్మాతల ఆలోచనల్లో మార్పు తీసుకురావాల్సింది ప్రజలే: బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్


నిర్మాతల ఆలోచనా విధానంలో మార్పు తీసుకురావాల్సింది ప్రజలేనని బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ అభిప్రాయపడ్డారు. బాలీవుడ్ లో ఒక సినిమా హిట్ అయితే చాలు, ఆ తర్వాత వచ్చే సినిమాలన్నీ అదే తరహాలో వస్తున్నాయని, ప్రేక్షకులు కూడా వాటికే పట్టం కడుతున్నారని అన్నారు. అందుకే, నిర్మాతలు కూడా ఎలాంటి భయం లేకుండా అటువంటి మూస కథల చిత్రాలకే ఓటు వేస్తున్నారన్నారు. ఈ మూస కథలు నిర్మించకుండా ఉండాలంటే ప్రజలే నిర్మాతల ఆలోచనల్లో మార్పు వచ్చేలా చేయాలని ఇర్ఫాన్ ఖాన్ కోరారు.

  • Loading...

More Telugu News