: ఓటమి పాలవుతామనుకోలేదు: ఊమెన్ చాందీ
జయాపజయాలను ప్రజాస్వామ్యంలో నిర్వచించలేమని కేరళ సీఎం ఊమెన్ చాందీ అన్నారు. కేరళ ఎన్నికల్లో యూడీఎఫ్ కూటమి ఓటమిపాలవుతుందని ఊహించలేదని అన్నారు. ఈ ఎన్నికల్లో సీపీఎం ఆధ్వర్యంలోని ఎల్డీఎఫ్ కూటమి విజయం దిశగా దూసుకుపోయింది. ఈ నేపథ్యంలో చాందీ మీడియాతో మాట్లాడుతూ, ప్రజల తీర్పును అంగీకరిస్తున్నామని, యూడీఎఫ్ చైర్మన్ గా ఈ ఓటమికి తాను బాధ్యత వహిస్తున్నానని అన్నారు. ఫలితాలను పరిశీలించి తమ కూటమి ఓటమికి గల కారణాలపై అన్ని కోణాల్లో విశ్లేషించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.