: మీడియా ముందుకు వచ్చిన పురచ్చితలైవి


తమిళనాడులో రెండోసారి విజయాన్ని అప్పగించిన ప్రజలకు జయలలిత కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల అనంతరం చెన్నయ్, పోయిస్ గార్డెన్స్ లోని తన నివాసం నుంచి బయటకు రాని జయలలిత, ఇప్పుడే బయటకు వచ్చి, మీడియా సమావేశంలో పాల్గొన్నారు. తమిళుల ప్రయోజనాలు కాపాడటమే తన లక్ష్యమని, సంక్షేమ పథకాలే తనకు తారకమంత్రమని ఆమె స్పష్టం చేశారు. ప్రజలు తనపై పెట్టుకున్న ఆశలను నెరవేర్చేందుకు కృషి చేస్తానని అన్నారు. తనపై డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు చేసిన వ్యతిరేక ప్రచారాన్ని ఈ ఎన్నికల ఫలితాలతో ప్రజలు తిప్పి కొట్టారని అన్నారు. తమిళ ప్రజలు చూపిన ఆదరణకు ఎంతో సంతోషిస్తున్నానని జయలలిత తెలిపారు. ఇది చారిత్రాత్మక తీర్పని, 1984 తరువాత అధికారంలో ఉన్న ఏ పార్టీ కూడా ఆ వెంటనే తిరిగి అధికారంలోకి రాలేదని గుర్తు చేశారు. తన జీవితమంతా తమిళ ప్రజలకు అంకితమని, వారు చూపిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, తన ఆఖరి ఊపిరి వరకూ తమిళుల సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు.

  • Loading...

More Telugu News