: కేరళలో పూర్తయిన కౌంటింగ్... తుది ఫలితాలు
కేరళలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ పూర్తయింది. మొత్తం 140 స్థానాలున్న రాష్ట్రంలో ఒక్క నియోజకవర్గం మినహా మిగిలిన అన్ని స్థానాల ఫలితాలూ వెల్లడయ్యాయి. ఎల్డీఎఫ్ 91 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీని సాధించింది. యూడీఎఫ్ 46 చోట్ల విజయం సాధించింది. బీజేపీ ఒక్క చోట, ఇతరులు ఒక్క స్థానంలో గెలిచారు. మరో స్థానంలో యూడీఎఫ్ ఆధిక్యంలో ఉంది. ఈ స్థానంలో యూడీఎఫ్ గెలిచే అవకాశాలు ఉండటంతో ఆ కూటమి బలం 47కు పెరగనుంది.