: పార్టీ ఓటమిలోనూ మరెవరికీ సాధ్యంకాని విధంగా కరుణానిధి వ్యక్తిగత విజయాల రికార్డు!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని తిరిగి చేజిక్కించుకోలేకపోయిన కరుణానిధి, తాను పోటీ చేసిన తిరువారూర్ నియోజకవర్గంలో విజయం సాధించారు. అంతేకాదు, వరుసగా 13 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడి, అన్నింటా విజయం సాధించిన ఏకైక భారతీయుడిగా కూడా రికార్డు సృష్టించారు. ఇండియాలో ఈ ఘనత మరెవరికీ సాధ్యం కాలేదు. అంటే దాదాపు 60 సంవత్సరాల నుంచి ఆయన తమిళనాడు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తూ, మరో ఐదేళ్ల అవకాశాన్ని ఈ ఎన్నికల ద్వారా అందుకున్నారన్నమాట. పోటీ చేసిన అన్ని శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించిన కరుణానిధి, అపజయమన్నదే ఎరుగని నేతగా కొనసాగుతున్నారు.