: బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపేశాడు..? ప్రశ్నకి నా ఆన్స‌ర్ ఇదే.. కేటీఆర్‌ ట్వీట్ పై స్పందించిన రానా


'బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?' అన్న ప్రశ్నకి స‌మాధానం త‌న ద‌గ్గ‌ర లేద‌ని, దాని కోసం త‌న‌ ఫ్రెండ్ రానా ద‌గ్గుబాటి ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా ఆరా తీయండంటూ కొద్ది సేప‌టి క్రితం స‌ర‌దాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేయడం ప‌ట్ల‌ రానా స్పందించాడు. కేటీఆర్ ట్విట్ట‌ర్‌లో ఈ అంశాన్ని ట్వీట్ చేసిన కొద్ది సేప‌టికే రానా ద‌గ్గుబాటి స‌మాధాన‌మిచ్చాడు. ‘హాహాహా.. మేము ఆ ఆన్స‌ర్ నే సినిమాలో చిత్రీకరిస్తున్నాం’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ చేసిన ట్వీట్ ని రానా ద‌గ్గుబాటి త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేశాడు.

  • Loading...

More Telugu News