: నెమ్మదిగా పెరుగుతున్న 'అమ్మ' ఆధిక్యం... డీఎంకేకు అందనంత దూరానికి!


తమిళనాడులో జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకేకు, కరుణానిధి నేతృత్వంలోని డీఎంకేకూ మధ్య తేడా క్రమంగా పెరుగుతోంది. ఈ ఉదయం కౌంటింగ్ ప్రారంభమై అరగంట వరకూ ఆధిక్యం ఇరు పార్టీల మధ్యా కాసేపు దోబూచులాడగా, ఆపై జయలలిత వైపు మొగ్గు కనిపించింది. ఆ మొగ్గు క్రమంగా పెరుగుతూ వెళుతోంది. గంట క్రితం 130 స్థానాల వరకూ అన్నాడీఎంకే గెలుస్తుందని భావించగా, ఇప్పుడది 140 స్థానాలను దాటింది. 98 స్థానాల వరకూ విజయం సాధించవచ్చని భావించిన డీఎంకే, ప్రస్తుతం 90 స్థానాలకు దిగజారింది. మధ్యాహ్నం రెండు గంటల క్రితం వరకూ నాలుగు చోట్ల ఆధిక్యంలో ఉన్న పీఎంకే, ప్రస్తుతం ఒక్క స్థానంలోనే ఆధిక్యంలో ఉంది. అన్నాడీఎంకే ఇప్పటికే 14 స్థానాల్లో విజయం సాధించి 127 చోట్ల దూసుకెళుతోంది. డీఎంకే 12 చోట్ల గెలిచి 78 చోట్ల ఆధిక్యంలో ఉంది. మధ్యాహ్నం 12 గంటల వరకూ ఇరు పార్టీల మధ్య 30 స్థానాల తేడా మాత్రమే ఉండటంతో 15 చోట్ల డీఎంకే పుంజుకుంటే సరిపోతుందని, ఫలితాలు మారతాయని డీఎంకే నేతలు వ్యాఖ్యానించారు. ఇప్పుడా వ్యత్యాసం 40 సీట్లకు పెరిగి డీఎంకే అందుకోలేనంత దూరానికి అన్నాడీఎంకే పరుగులు పెట్టింది.

  • Loading...

More Telugu News