: కేరళలో చాప కింద నీరులా బీజేపీ... పలు స్థానాల్లో సత్తా చూపిన కమలం


కేరళ రాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ ప్రత్యర్థులకు చెమటలు పట్టించింది. ఎన్నికల ఫలితాలను బట్టి కేవలం ఒకే ఒక స్థానం దక్కించుకోనుందని తెలుస్తున్నా.. చాలా స్థానాల్లో కమలం ప్రత్యర్థులకు గట్టి పోటీనిచ్చింది. కొన్ని చోట్ల ద్వితీయ స్థానంలో నిలిచింది. తిరువనంతపురంలోని నెమామ్ స్థానంలో బీజేపీ అభ్యర్థి ఓ.రాజగోపాల్ ప్రత్యర్థిపై మంచి ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ రాజగోపాల్ విజయం సాధించడం దాదాపు ఖాయమనే చెప్పుకోవచ్చు. మంజేశ్వర్ నియోజకవర్గంలో ముస్లింలీగ్ అభ్యర్థి అబ్దుల్ రజాక్ ముందంజలో ఉండగా... బీజేపీ అభ్యర్థి కె.సురేంద్రన్ రెండో స్థానంలో ఉన్నారు.] కాసరగాడ్ నియోజకవర్గంలో ముస్లింలీగ్ అభ్యర్థి నెల్లికున్ను తర్వాతి స్థానంలో బీజేపీ అభ్యర్థి రవిషతంత్రి నిలిచారు. పాలక్కాడ్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థికి, బీజేపీ అభ్యర్థి మధ్య విజయం ‘నీదా? నాదా?’ అన్న స్థాయిలో పోటీ నడిచింది. వట్టియూర్కవు స్థానంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కుమ్మనం రాజశేఖరన్ కాంగ్రెస్ అభ్యర్థి కె.మురళీధరన్ కు గట్టి పోటీనిచ్చి రెండో స్థానంలో ఉన్నారు. ఇంకా బీజేపీ మూడో స్థానంలో నిలిచిన నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ ఓటు శాతం 6.15 మాత్రమే ఉండగా... ప్రస్తుతం 11.1 శాతానికి చేరుకుంది. దీన్ని బట్టి చూస్తే భవిష్యత్తులో కేరళలోనూ బీజేపీ అధికార పీఠంపై పాగా వేయవచ్చని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News