: 'బిగ్ న్యూస్' వెల్లడించిన కేటీఆర్... అంద‌రూ ఊహించిందే!


రెండు రోజుల క్రితం కేటీఆర్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ‘ఎల్లుండి ఓ పెద్దవార్త మీతో పంచుకుంటాను.. అప్పటివరకు సస్పెన్స్‌’ అని పేర్కొన్న విష‌యం తెలిసిందే. కేటీఆర్ ట్వీట్ పై అందరూ ఊహించిందే నిజమైంది. హైద‌రాబాద్‌లోని వేవ్‌రాక్ భ‌వ‌నంలో యాపిల్ సీఈవోతో తాను భేటీలో పాల్గొంటుండ‌గానే కొద్ది సేప‌టి క్రితం త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా కేటీఆర్ స్పందించారు. ‘బిగ్ న్యూస్‌: యూఎస్ వెలుపల యాపిల్ లార్జెస్ట్ టెక్నాలజీ డెవలప్ మెంట్ సెంటర్ ఉన్న న‌గ‌రంగా హైదరాబాద్ నిలిచింది’ అంటూ పోస్ట్ చేశారు. యాపిల్ భ‌వ‌నం ఓపెనింగ్ సంద‌ర్భంగా యాపిల్ సీఈవో, సీఎం కేసీఆర్, అక్క‌డి యువ‌త‌తో దిగిన సెల్ఫీల‌ను కేటీఆర్ పోస్ట్ చేశారు. అంతేకాదు, పాలేరులో టీఆర్ ఎస్ భారీ మెజారిటీతో ఘ‌న విజ‌యం సాధించింద‌ని కూడా ఆయ‌న పేర్కొన్నారు.
  • Loading...

More Telugu News