: పాలేరు ఉప ఎన్నికల రేస్‌లో కారే గెలిచింది.. అపూర్వ విజయం మరచిపోలేనని తుమ్మల వ్యాఖ్య
పాలేరు ఎప ఎన్నికల రేస్ లో కారు జోరు మరోసారి నిరూపితమయింది. పాలేరులోనూ గులాబీ జెండానే ఎగిరింది. టీఆర్‌ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఘన విజయం సాధించారు. మొత్తం 17 రౌండ్లు పూర్తయ్యే సరికి కాంగ్రెస్ అభ్యర్థి సుచరితా రెడ్డిపై 45,650 ఓట్ల ఆధిక్యంతో గెలుపొంది తుమ్మల విజయ ఢంకా మోగించారు. ఈ సందర్భంగా తుమ్మల మీడియాతో మాట్లాడుతూ... మూడేళ్లలో పాలేరుని ఆదర్శవంతమైన నియోజక వర్గంగా తీర్చిదిద్దుతానని వ్యాఖ్యానించారు. పాలేరు అన్ని రంగాల్లో అబివృద్ధి సాధించేలా పాలిస్తానని ఉద్ఘాటించారు. పాలేరు ప్రజలకు ధన్యవాదాలని, వారు తన మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తుమ్మల అన్నారు. త్వరలోనే పాలేరు ప్రజలని కలుస్తానన్నారు. ప్రజలందించిన అపూర్వ విజయం మరచిపోలేనని ఆయన అన్నారు. టీఆర్ఎస్‌పై ప్రజలకు ఎనలేని నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు.