: ఆపిల్ సీఈవోకి షారుఖ్ ఖాన్ డిన్నర్ పార్టీ... పలువురు బాలీవుడ్ స్టార్స్ హాజరు!

వారం రోజుల భారత పర్యటనలో ఉన్న యాపిల్ సీఈవో టిమ్ కుక్ కి షారుఖ్ ఖాన్ నిన్న రాత్రి పార్టీ ఇచ్చాడట. ముంబయి బంద్రాలోని తన నివాసం ‘మనాత్’లో టిమ్‌కుక్‌కి షారుఖ్ ఇచ్చిన డిన్నర్ పార్టీలో బాలీవుడ్ స్టార్స్ కూడా చాలా మంది పాల్గొన్నారని తెలుస్తోంది. షారుఖ్ ఖాన్-టిమ్‌కుక్ చాలా కాలంగా కలవాలని అనుకుంటున్నారట. 2011లో యాపిల్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన తరువాత టిమ్‌కుక్ మొదటి సారిగా భారత్ పర్యటనలో ఉన్నారు. డిన్నర్ సందర్భంగా ఐఓఎస్ అభివృద్ధికి భారత్ లో మంచి అవకాశం ఉందని టిమ్ కుక్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టిమ్‌కుక్ హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు.