: ఆపిల్ సీఈవోతో కేసీఆర్ భేటీ.. హైదరాబాద్‌లో యాపిల్ కేంద్రం ఏర్పాటుతో వేలాది మందికి ఉపాధి అవకాశాలని సీఎం వ్యాఖ్య
హైదరాబాద్ గచ్చిబౌలికి దగ్గరలోని నానక్ రామ్ గూడలోని 'వేవ్ రాక్' భవనానికి తెలంగాణ సీఎం కేసీఆర్ చేరుకున్నారు. ఇప్పటికే అక్కడికి చేరుకున్న ఆపిల్ సీఈవో టిమ్ కుక్ తో కేసీఆర్ భేటీ అయ్యారు. హైదరాబాద్ లో యాపిల్ డెవలప్ మెంట్ సెంటర్ ప్రారంభం కావడం మనకు ఎంతో గర్వకారణమంటూ ఈ సందర్భంగా కేసీఆర్ వ్యాఖ్యానించారు. అక్కడి యాపిల్ మ్యాప్ కేంద్రం ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు లభించనున్నాయని కేసీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. ఆపిల్ సీఈవో టిమ్ కుక్- సీఎం కేసీఆర్ భేటీలో తెలంగాణ ఐటీ శాఖమంత్రి కేటీఆర్, యాపిల్ సంస్థ ప్రతినిధులు కూడా పాల్గొంటున్నారు.