: తిరుపతి వెంకన్నకు మరో అజ్ఞాత భక్తుడి భారీ విరాళం
కొందరు భక్తుల్లోని ఆధ్యాత్మిక చింతన వారు ఎటువంటి ప్రచారాన్నీ కోరుకోనివ్వకుండా చేస్తోంది. ‘దేవునికి భక్తితో కానుకలు సమర్పించాలి.. అంతేకానీ కానుకలు పడేసి అక్కడి గోడలపై పేర్లు చెక్కించుకోవడం, పేరు మారు మోగిపోయేలా చేసుకోవడం ఎందుకు..?' అని ఆలోచిస్తున్నారు నిజమైన భక్తులు. ఇటీవల షిర్డీ సాయిబాబా హుండీలో ఓ అజ్ఞాత భక్తుడు వజ్రాలు వేయడం, దేశంలోని పలు ప్రసిద్ధ ఆలయాల్లో కనీసం పేరయినా చెప్పుకోకుండా దేవుళ్లకి కానుకలు సమర్పిస్తుండడం వింటూనే ఉన్నాం. తిరుపతిలో తరచూ ఇటువంటి సంఘటనలు కనిపిస్తుండడం తెలిసిన సంగతే. తాజాగా మరో అజ్ఞాత భక్తుడు తిరుపతి వేంకటేశ్వరుడికి భారీ విలువచేసే కానుకను అందించాడు. ఆ అజ్ఞాత భక్తుడు ఈరోజు ఉదయం అలంకార ప్రియుడైన శ్రీవారికి రూ.40 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాన్ని ఇచ్చాడు.