: 'రావోను' దూసుకొస్తోంది... తస్మాత్ జాగ్రత్త!


బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారి, తర్వాత పెను తుపానుగా రూపాంతరం చెందగా, దీనికి 'రావోను' అని పేరు పెట్టిన అధికారులు, తుపాను కదలికలను నిశితంగా గమనిస్తూ, ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం మచిలీపట్నం సమీపంలో ఉన్న రావోను, మరో రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల మధ్య తీరాన్ని దాటవచ్చని, ఆ సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని వెల్లడించారు. గంటకు పది కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతున్న రావోను మరింత బలాన్ని పుంజుకుంటోందని, నేడు, రేపు దీని ప్రభావంతో విస్తారంగా వర్షాలు పడతాయని, ముఖ్యంగా కోస్తాంధ్రాలో భారీ వర్షాలు, కొన్నిచోట్ల కుంభవృష్టి కురుస్తుందని తెలిపారు. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తుపానుపై అన్ని జిల్లాల కలెక్టరేట్ కార్యాలయాలను అలర్ట్ చేశారు. హెల్ప్ లైన్ లను ఏర్పాటు చేయాలని, రెవెన్యూ, పంచాయతీ సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

  • Loading...

More Telugu News