: 'అమ్మ' వచ్చేస్తోంది... స్పష్టమైన ఆధిక్యం దిశగా అన్నాడీఎంకే!


తమిళనాట అన్నాడీఎంకే, డీఎంకేల మధ్య దోబూచులాడుతున్న విజయలక్ష్మి క్రమంగా జయలలితవైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. కొద్ది సేపటి క్రితం వరకూ పది, పన్నెండు అధిక స్థానాల్లో ఆధిక్యం కనబరిచిన అన్నాడీఎంకే, ఇప్పుడు ఏకంగా 36 స్థానాల ముందుంది. ఇప్పటివరకూ 175 స్థానాల కౌంటింగ్ లీడ్ ఫలితాలు వెల్లడికాగా, అన్నాడీఎంకే 105, డీఎంకే కూటమి 69, పీఎంకే 1 స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే, జయలలిత పార్టీ స్పష్టమైన ఆధిక్యంలోకి దూసుకురావడం ఖాయంగా తెలుస్తోంది. తమిళనాట దాదాపు మూడు దశాబ్దాల తరువాత ఓటర్లు వరుసగా ఒకే పార్టీకి రెండుసార్లు అధికారం ఇచ్చినట్టవుతుంది!

  • Loading...

More Telugu News