: ఎదురు దెబ్బ తప్పదా?... కేరళలో శ్రీశాంత్, తమిళనాట శరత్ కుమార్ వెనుకంజ!


ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో పెను సంచలనాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ, అసోం, పుదుచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ నేటి ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళుతుండగా, మిగిలిన చోట్ల మాత్రం మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి. ఇక ఈ ఎన్నికల బరిలో నిలిచిన ప్రముఖులంతా దాదాపుగా విజయం దిశగా సాగుతుండగా, ఇద్దరు మాత్రం వెనుకబడిపోయారు. తమిళనాడులోని తిరుచెందూరు నియోజకవర్గం నుంచి అన్నాడీఎంకే అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రముఖ నటుడు శరత్ కుమార్ వెనుకబడిపోయారు. ఇక కేరళ రాజధాని తిరువనంతపురంలో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ క్రికెటర్ శ్రీశాంత్ కూడా వెనుకబడ్డాడు. వీరిద్దరూ పరాజయం పాలయ్యే అవకాశాలే ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News