: ఫడ్నవీస్ తో భేటీ... షారూక్ ఖాన్ తో డిన్నర్!: విభిన్నంగా కుక్ పర్యటన
భారత పర్యటనకు వచ్చిన అమెరికా టెక్నాలజీ దిగ్గజం యాపిల్ సీఈఓ టిమ్ కుక్... విభిన్న రంగాలకు చెందిన ప్రముఖులతో కలుస్తూ ముందుకు సాగుతున్నారు. మొన్న రాత్రే ముంబై చేరుకున్న కుక్... నిన్న ఉదయమే సిద్ధివినాయకుడిని దర్శించుకుని రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ కొడుకుతో మాట కలిపారు. ఆ తర్వాత మధ్యాహ్న భోజనానికి ముఖేశ్ ఇంటికి ఆయన వెళ్లారు. ఆ తర్వాత టాటా సన్స్ చైర్మన్ సైరస్ మిస్త్రీతో పాటు టీసీఎస్ సీఈఓ చంద్రశేఖరన్ తో భేటీ అయ్యారు. ఆ తర్వాత మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ను కలిసిన కుక్... రాత్రి డిన్నర్ ను బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ తో కలిసి చేశారు.