: ఎగ్జిట్ పోల్స్ అంచనాల దిశగానే తొలి ఫలితాల సరళి!
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తొలి ఫలితాల సరళి అత్యధిక సంస్థలు అంచనాలు వేసినట్టుగానే వస్తున్నాయి. కేరళలో ఎల్డీఎఫ్ 49 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, యూడీఎఫ్ 44, బీజేపీ 3 స్థానాల్లో ఆధిక్యంలో సాగుతున్నాయి. అసోంలో బీజేపీ 13, కాంగ్రెస్ 1 స్థానంలో దూసుకెళ్తుండగా, పశ్చిమ బెంగాల్ లో మమత పార్టీ తిరుగులేని ఆధిక్యం దిశగా సాగుతోంది. తృణమూల్ ఏకంగా 97 స్థానాల్లో ముందంజలో ఉండగా, వామపక్షాలు 17, కాంగ్రెస్ 17, బీజేపీ 1 స్థానంలో ఆధిక్యం చూపుతున్నాయి. ఈ ఎన్నికల్లో అత్యంత ఉత్కంఠను రేపిన తమిళనాడులో మాత్రం ఇప్పటికి ఎవరికీ స్పష్టమైన ఆధిక్యం రానట్టే కనిపిస్తోంది. ఏఐఏడీఎంకే 20, డీఎంకే 19 స్థానాల్లో ముందంజలో ఉండి నువ్వా? నేనా? అన్న రీతిలో సాగుతున్నాయి. పుదుచ్చేరిలో కాంగ్రెస్ కూటమి 7, ఏఐఏడీఎంకే 4, ఏఐఎన్ఆర్సీ 1 స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి.