: జోరువానలోనే చంద్రబాబు సుడిగాలి పర్యటన... గొడుగులు పట్టుకుని వచ్చిన మహిళలు


టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నిన్న తూర్పుగోదావరి జిల్లా పర్యటన సాంతం వర్షంలోనే కొనసాగింది. నిన్న మధ్యాహ్నం 12 గంటలకే ప్రత్యేక విమానంలో జిల్లాలోని మధురపూడి విమానాశ్రయానికి వచ్చిన చంద్రబాబు... అక్కడి నుంచి బస్సులో రాజమహేంద్రవరం రూరల్ మండలంలోని బొమ్మూరుకు చేరుకున్నారు. అప్పటికే చిన్నగా ప్రారంభమైన వర్షం సాయంత్రం దాకా కురుస్తూనే ఉంది. వర్షాన్ని ఏమాత్రం లెక్కచేయని చంద్రబాబు తన షెడ్యూల్ లోని అన్ని ప్రాంతాల్లో పర్యటించి ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వేదికలపై ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. జోరువాన కురుస్తున్నా... చంద్రబాబును చూసేందుకు మహిళలు గొడుగులు పట్టుకుని మరీ బయటకు రావడం కనిపించింది.

  • Loading...

More Telugu News