: అనంత్ అంబానీతో టిమ్ కుక్ ముచ్చట్లు!... లంచ్ కు ‘అంటీలియా’ వెళ్లిన యాపిల్ సీఈఓ!
టెక్నాలజీ దిగ్గజం యాపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈఓ) టిమ్ కుక్... భారత పర్యటనలో తనదైన శైలిలో దూసుకెళుతున్నారు. మొన్న రాత్రే ప్రైవేట్ జెట్ లో ముంబై చేరుకున్న కుక్... నగరంలోని తాజ్ మహల్ హోటల్ లో బస చేశారు. నిన్న ఉదయమే నగరంలోని ప్రసిద్ధ సిద్ధివినాయకుడి ఆలయానికి వెళ్లారు. హిందువుల మాదిరే ఆలయానికి వెళ్లిన కుక్ కు అక్కడ ఘన స్వాగతం లభించింది. సిద్ధివినాయకుడిని దర్శించుకుని తిరిగి వస్తున్న సమయంలో కుక్ కు రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ తారసపడ్డారు. ఈ సందర్భంగా అనంత్ తో కుక్ కొద్దిసేపు మాట్లాడారు. ఆ తర్వాత తన సొంత కంపెనీ కార్యకలాపాలపై దృష్టి సారించిన కుక్... మధ్యాహ్న భోజనానికి ముఖేశ్ అంబానీ ఇల్లు ‘అంటీలియా’కు వెళ్లారు. ఉదయం సిద్ధివినాయకుడి ఆలయంలో తనను కలిసిన అనంత్ అంబానీ ఆహ్వానం మేరకే కుక్ లంచ్ కు రిలయన్స్ అధినేత ఇంటికి వెళ్లినట్లు సమాచారం.