: సొంతగూటికి కొత్తపల్లి!... చంద్రబాబు సమక్షంలో నేడు టీడీపీలో చేరిక
సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి, పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ మాజీ అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు నేడు తన సొంత పార్టీ టీడీపీలోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇప్పటికే వైసీపీకి రాజీనామా ప్రకటించిన కొత్తపల్లి నేడు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సమక్షంలో సైకిల్ ఎక్కనున్నారు. ఈ మేరకు ఇప్పటికే విజయవాడ చేరుకున్న కొత్తపల్లి అనుచరులు... నగరంలోని ఎన్ఏసీ కళ్యాణమండపంలో భారీ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. తన అనుచరగణంతో కలిసి మరికాసేపట్లో విజయవాడ రానున్న కొత్తపల్లి టీడీపీలో చేరిపోనున్నారు.