: ఇప్పుడు తెలుగు హీరోయిన్ లు లేరు...నిహారిక స్పూర్తిగా అమ్మాయిలు వస్తారు: అవసరాల శ్రీనివాస్
తెలుగు హీరోయిన్లతో ఎందుకు సినిమాలు చేయరని తనను చాలా మంది అడుగుతుంటారని నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ తెలిపారు. 'ఒక మనసు' ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, నాలుగేళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో నిహారిక హీరోయిన్ అవుతానంటే అభ్యంతరం చెప్పనని నాగబాబు అన్నారని, ఇప్పుడు అదే మాట నిలబెట్టుకున్నారని అన్నాడు. తాను సినిమాలు చేయడానికి తెలుగు హీరోయిన్ వచ్చిందని, నిహారిక స్పూర్తిగా చాలా మంది తెలుగు అమ్మాయిలు సినిమాల్లోకి రావాలని అవసరాల శ్రీనివాస్ పిలుపునిచ్చాడు. తాను లాంఛ్ చేసిన అబ్బాయి ఈ రోజు ఇంత స్థాయిలో ఉన్నాడంటే చాలా గర్వంగా ఉందని అన్నాడు. నాగశౌర్య అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపాడు. వారిద్దరికీ ఆల్ ది బెస్ట్ అని శుభాకాంక్షలు తెలిపాడు.