: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అరుపులపై అల్లు అర్జున్ స్పందన!
సినీ నటుడు అల్లు అర్జున్ సరికొత్త లుక్ తో 'ఒకమనసు' ఆడియో వేడుకలో దర్శనమిచ్చి అభిమానులను అలరించాడు. నాగశౌర్య, నాగబాబు కుమార్తె నిహారిక జంటగా నటించిన ఈ సినిమా ఆడియో వేడుకకు వచ్చిన సందర్భంగా మూడో పాటను విడుదల చేసిన అల్లు అర్జున్ మాట్లాడుతూ, 'నీహా...తల్లీ ఆల్ ది బెస్ట్' అన్నాడు. బాగా ఆలోచించే సినిమాల్లో దిగి ఉంటావని అన్నాడు. 'నువ్వు ఆనందంగా ఉండడమే నాకు కావాలి. నాగశౌర్యకి కూడా శుభాకాంక్షలు' అని చెప్పాడు. తరువాత పవర్ స్టార్ అనగానే కేకలు మిన్నంటడంతో ఒక నిమిషం గ్యాప్ ఇచ్చిన అల్లు అర్జున్...పవర్ స్టార్ అని అరిచిన ప్రతిసారి మాట్లాడకుండా వెళ్లిపోవడానికి కారణం, పవన్ కల్యాణ్ అభిమానులేనని అన్నాడు. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ గ్రూప్ అనవసరమైన గోల చేస్తున్నారని అన్నాడు. అలా అరవడం వల్ల అంత పెద్ద స్టార్ గురించి మెకానికల్ గా మాట్లాడేసి వెళ్లిపోతున్నారని అన్నాడు. ఒక పెద్ద డైరెక్టర్ వంద రోజులు కష్టపడి తీసిన ఆ సినిమా గురించి చెప్పుకునే బాధ్యత ఉందని అన్నాడు. మనకి సంబంధం లేని హీరోల సినిమా పంక్షన్లకు వెళ్లి కూడా అరుస్తున్నారని మండిపడ్డాడు. 'అది సంస్కారం కాదు కదా?' అన్నాడు. 'బయటి ఫంక్షన్స్ లో అలా అరవడం తప్పు' అని హితవు పలికాడు. తానిలా ఉన్నది తన అన్న వల్లే అని పవన్ కల్యాణ్ గారు కొన్ని వందల సార్లు చెప్పారని గుర్తు చేశాడు. అంత స్థాయి ఉన్న చిరంజీవిగారు మాట్లాడుతుంటే కూడా ఇలా అరవడం తనను ఇబ్బందికి గురి చేసిందని అల్లు అర్జున్ తెలిపాడు. అభిమానులు ఎంత అరిచినా పవన్ కల్యాణ్ గురించి మాట్లాడకూడదని అప్పుడే నిర్ణయించుకున్నానని చెప్పాడు. ఇదే విషయం మీడియా ముందు పవన్ కల్యాణ్ గురించి చెబితే అదో వివాదం అవుతుందని, అలా కాకూడదనే అభిమానులతో నేరుగా మాట్లాడుతున్నానని అన్నాడు. 'పవర్ స్టార్... పవర్ స్టార్' అని అరిచినప్పుడు ఆయన మాట్లాడకుండా వెళ్లిపోతే మీరు ఎంత హర్ట్ అవుతారో, మీరు అలా అరిచినప్పుడు కూడా ఇలాగే తాను హర్ట్ అయ్యానని అన్నాడు. అనవసరంగా మనకు మనం తగ్గామని అల్లు అర్జున్ తెలిపాడు. మన ఫ్యాన్సే బాధపెట్టినప్పుడు కొంచెం బాధకలిగించిందని అల్లు అర్జున్ అన్నాడు. తనను అపార్థం చేసుకోరని, అర్ధం చేసుకుంటారని భావిస్తున్నానని అన్నాడు.