: గొప్పలు చెప్పుకుంటే ఎలా సాయం చేస్తారు?: రఘువీరా ప్రశ్న


ఆంధ్రప్రదేశ్‌ కు సాయం చేయాలని కోరుతూ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గొప్పలు చెప్పుకుంటే కేంద్రం ఎలా సాయం చేస్తుందని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, మాజీ మంత్రి శైలజానాథ్‌ ప్రశ్నించారు. హైదరాబాదులో వారు మాట్లాడుతూ, ఢిల్లీ పర్యటన సందర్భంగా చంద్రబాబు మాట్లాడిన తీరు చూస్తుంటే రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేసేందుకు సిద్ధమైనట్టు ఉందని అన్నారు. కేంద్రానికి సెప్టెంబర్‌ నెలలో పంపాల్సిన కరవు నివేదికను ఫిబ్రవరిలో పంపారని వారు ఎద్దేవా చేశారు. కేంద్రం వద్ద తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అక్రమ ప్రాజెక్టుల గురించి సీఎం ఎందుకు ప్రస్తావించలేదని ఆయన అడిగారు. కేంద్రం సహాయ నిరాకరణ, తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు కడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో సమస్యలకు ఎదురొడ్డి పోరాడే ముఖ్యమంత్రి కావాలని చెప్పిన ఆయన, టీడీఎల్పీ వెంటనే సమావేశమై చంద్రబాబు స్థానంలో జవసత్వాలున్న నేతను ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News