: సచిన్ కంటే గొప్ప బ్యాట్స్ మన్ అవ్వగల సామర్థ్యం కోహ్లీకి ఉంది: ఇంగ్లండ్ మాజీ పేసర్


విరాట్ కోహ్లీకి సచిన్ టెండూల్కర్ కంటే గొప్ప బ్యాట్స్ మన్ గా ఎదగగలిగే సామర్థ్యముందని ఇంగ్లండ్ మాజీ పేసర్ డొమినిక్ కార్క్ అభిప్రాయపడ్డారు. ఐపీఎల్ లో అద్భుతంగా ఆడుతున్న కోహ్లీ సూపర్ ఫాంలో ఉన్నాడని ఆయన చెప్పారు. బౌలర్ ఎవరన్న పట్టింపు లేకుండా కోహ్లీ ఆడుతున్న తీరు అద్భుతమని ఆయన చెప్పారు. కోహ్లీ ఇలాగే ఆడుతుంటే పరిమిత ఓవర్ల క్రికెట్ లో నెలకొల్పిన చాలా రికార్డులు బద్దలవుతాయని ఆయన పేర్కొన్నారు. సచిన్ కంటే కోహ్లీ గొప్పవాడవుతాడని చెప్పడం పెద్దమాటే అవుతుందని చెప్పిన ఆయన, కోహ్లీలో ఆ సామర్థ్యం ఉందని అభిప్రాయపడ్డారు. కాగా, కెరీర్ లో అత్యుత్తమ ఫాంలో ఉన్న కోహ్లీ ఈ ఐపీఎల్ లో మూడు సెంచరీలతో అత్యధిక పరుగులు సాధించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News