: నెల్లూరుకి 120 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 230 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం
బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం నేటి అర్ధరాత్రి తరువాత తుపానుగా మారనుందని వాతావరణ శాఖాధికారులు పేర్కొంటున్నారు. వాయుగుండం ప్రస్తుతానికి నెల్లూరు జిల్లా కేంద్రానికి 120 కిలోమీటర్ల దూరంలోనూ, మచిలీపట్నానికి 230 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వారు తెలిపారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లోని దక్షిణ కోస్తా జిల్లాల కలెక్టర్లు అధికారులను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలకు హెచ్చరికలు చేశారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని వారు సూచించారు. మత్స్యకారులెవరూ సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. అయితే అప్రమత్తంగా ఉండాలని సూచించారు.