: విభజన హామీల అమలుకై సాగిస్తోన్న ఉద్యమంలో పవన్ కల్యాణ్ కూడా పాల్గొనాలి: చలసాని శ్రీనివాస్
తమ పోరాటం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం మాత్రమే కాదని, విభజన సమయంలో ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చాలని ఉద్యమిస్తున్నామని ఆంధ్రా మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ అన్నారు. విభజన హామీల కోసం తాము చేసే ఉద్యమంలో పవన్ కల్యాణ్ తమతో కలిసి రావాలని చలసాని శ్రీనివాస్ మరోసారి పిలుపునిచ్చారు. ఆంధ్ర నేతలందరూ కలిసి ప్రశ్నించాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు. హక్కుల కోసం చేస్తోన్న ఉద్యమం వాటిని సాధించుకునే వరకు కొనసాగుతూనే ఉంటుందని చలసాని తెలిపారు. ఏపీలోని ప్రతిపక్షాలు కూడా విభజన హామీల్ని సాధించే క్రమంలో అందర్నీ కలుపుకునే ప్రయత్నం చేయాలని ఆయన సూచించారు. ఇప్పుడు పోరాటం చేయకపోతే చరిత్ర మిమ్మల్ని క్షమించబోదని ఆయన వ్యాఖ్యానించారు.