: జగన్ పై భూమా నాగిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు


వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత భూమా నాగిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో వైఎస్సార్సీపీ నేతలు కాంట్రాక్టులు తీసుకున్నారని, ఆ సొమ్ము ముట్టిన తర్వాత ఏపీలో జలదీక్షలకు దిగిన జగన్ కొత్త డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. వైఎస్సార్సీపీకి రాష్ట్ర ప్రయోజనాలు పట్టవా? అని భూమా ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా జగన్ జలదీక్ష చేస్తుండటంపై కర్నూల్ ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారన్నారు. జలదీక్ష విషయమై కర్నూల్ లోని వైఎస్సార్సీపీ నాయకులను కూడా జగన్ సంప్రదించలేదని.. రాజకీయంగా లబ్ధి పొందేందుకే ఈ దీక్ష చేస్తున్నారనడానికి ఇంత కన్నా నిదర్శనం ఇంకేం కావాలని అన్నారు. ఏపీకీ ప్రత్యేక హోదా విషయమై కేంద్ర ప్రభుత్వంతో గొడవపడాలని జగన్ చెబుతుండటం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్రంతో గొడవపడితే వచ్చే ప్రయోజనాలేంటో జగన్ చెప్పాలని ప్రశ్నించారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు సహనాన్ని చేతకానితనంగా తీసుకోవద్దని జగన్ కు నాగిరెడ్డి సూచించారు. కాగా, వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి మారిన తర్వాత భూమా నాగిరెడ్డి, జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేయడం ఇదే ప్రథమం.

  • Loading...

More Telugu News