: అమ్మాయిలు, అబ్బాయిలు పక్కపక్కనే కూర్చోవద్దు: నిబంధన విధించిన పాక్ సర్గోధా వర్సిటీ
విద్యార్థులపై పాకిస్థాన్‌లోని సర్గోధా యూనివర్సిటీ ఆంక్షలు విధించింది. అమ్మాయిలు, అబ్బాయిలు పక్కపక్కనే కూర్చోవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇస్లామిక్ సిద్ధాంతాలను గౌరవించడం, సంప్రదాయాలను పాటించడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని విద్యార్థులపై ఈ ఆంక్షలు విధించామని వర్సిటీ అధికారులు తెలిపారు. చదువుకోసం అంటూ విద్యార్థినీ విద్యార్థులు ఒకరి పక్కన ఒకరు కూర్చోవడం ఇస్లాంకి విరుద్ధమేనని పేర్కొన్నారు. అయితే వర్సిటీలో అమ్మాయిలు, అబ్బాయిలు గ్రూపుగా చేరి చదువుకోవచ్చని పేర్కొంది. అయితే, వర్సిటీ తమపై విధిస్తోన్న ఆంక్షలపై విద్యార్థులు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.