: చెన్నైకి పెనుముప్పు తప్పినట్టే... ఒడిశా వైపుకు వాయుగుండం


బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలపడుతూ ఉత్తర ఈశాన్య దిశగా సాగుతూ ఒడిశా వైపు వెళుతుండటంతో, చెన్నై నగరానికి ముప్పు తప్పినట్టేనని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గత రెండు రోజులుగా భారీ వర్షాలతో అతలాకుతలమైన చెన్నై, తాజా వాయుగుండంతో మరింతగా నష్టపోతుందని, వరదలు రావచ్చని భావిస్తూ, ఎన్డీఆర్ఎఫ్ సహా పలు సహాయక బృందాలు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇక ఒడిశా వైపు కదులుతున్న వాయుగుండం కారణంగా కోస్తాంధ్ర అంతటా విస్తారంగాను, రాయలసీమలో పలు ప్రాంతాల్లోను ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఈ వాయుగుండం మరో 24 గంటల తరువాత తుపానుగా మారుతుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. నెల్లూరు, ప్రకాశం సముద్రతీరం వెంబడి భారీ ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా ఉండాలని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News