: ఏపీ నేతల మాటలు రాయలసీమ ప్రజలవి కావు, తెలంగాణ వాదులు గమనించాలి: బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు పలువురు తెలంగాణ ప్రభుత్వాన్ని రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్, ఏపీ మంత్రులు దేవినేని ఉమా, కేఈ కృష్ణమూర్తి తెలంగాణవాదులను రెచ్చగొట్టేట్లుగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాయలసీమను కష్టాల్లోకి నెట్టేస్తున్నారని ఆయన అన్నారు. నేతలు చేస్తోన్న వ్యాఖ్యలు వారి వ్యక్తిగతంగానే చేస్తున్నారని, అవి రాయలసీమ వాసుల మాటలు కావని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలని కోరారు.