: భర్తని వదిలేశాను కదా...ఇంకా ఆ పేరెందుకు?: బాలీవుడ్ భామ మలైకా
మలైకా అరోరా ఖాన్...ఇలా టైటిల్స్ లో వేసినందుకు మలైకా అరోరాకు కోపం ముంచుకొచ్చింది. భర్తను వదిలేసిన తరువాత ఇంకా అదే పేరుతో ఎందుకు పిలుస్తున్నారంటూ నిలదీసింది. మలైకా అరోరా హిందీ టీవీ ఛానెల్స్ లో కొన్ని కార్యక్రమాలకు జడ్జిగా వ్యవహరిస్తోంది. వారంతా మలైకాను ఇప్పటికీ మలైకా అరోరా ఖాన్ అని సంబోధిస్తున్నారు. దీనిపై మలైకా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తానిప్పుడు మలైకా అరోరాను మాత్రమేనని చెబుతోంది. తన పేరు చివర 'ఖాన్' అన్నది లేదని చెప్పింది. కాగా, సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ తో వైవాహిక బంధాన్ని తెగదెంపులు చేసుకున్న మలైకా అరోరా, కుమారుడితో కలిసి వేరే చోట నివాసం ఉంటోంది. అంతే కాకుండా ఈ మధ్య కాలంలో మరో నటుడితో డేటింగ్ లో ఉందని బాలీవుడ్ కథనాలు ప్రసారమవుతున్నాయి. ఈ నేపధ్యంలో ఖాన్ కుటుంబంతో ఉన్న బంధాన్ని పూర్తిగా తెంచుకోవాలని మలైకా అరోరా భావిస్తున్నట్టు కనిపిస్తోంది.