: దీక్ష విరమించిన జగన్... నిమ్మరసం అందించిన రైతులు
తెలంగాణ అక్రమంగా నిర్మిస్తోన్న ప్రాజెక్టులకు, వాటి పట్ల ఏపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా కర్నూలులో మూడు రోజులుగా దీక్ష చేస్తోన్న వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి దీక్షను విరమించారు. జగన్‌కు నిమ్మరసం ఇచ్చిన రైతులు ఆయనతో దీక్షను విరమింపజేశారు. కర్నూలులో జగన్ జలదీక్షపై అటు టీడీపీ నేతలు, ఇటు తెలంగాణ నేతలు ఎన్నో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దీక్ష విరమించిన తరువాత తనకు మద్దతు తెలిపిన ప్రజలకు జగన్ ధన్యవాదాలు తెలిపారు. ఎండల్ని లెక్కచేయకుండా ప్రజలు దీక్షా స్థలికి చేరుకోవడంతోనే వారి కష్టాలు ఎంతగా ఉన్నాయో అర్థం అవుతుందని జగన్ అన్నారు.