: ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై తెలుగు రాష్ట్రాలు సహా ఒడిశా, మహారాష్ట్రకు నోటీసులు
ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై తెలుగు రాష్ట్రాలు సహా ఒడిశా, మహారాష్ట్రలకు నోటీసులు జారీ అయ్యాయి. రేలా అనే స్వచ్ఛంద సంస్థతో పాటు వరలక్ష్మి ఎన్జీటీ దాఖలు చేసిన పిటిషన్ తో విచారణ చేపట్టిన నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఈ అంశంపై సదరు రాష్ట్రాలకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసి, జవాబివ్వాలని సూచించింది. రాష్ట్రాలకు రెండు వారాల గడువునిచ్చింది. ఏపీ, తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్రల్లోని పలు జిల్లాల్లో భారీగా అక్రమ ఇసుక తవ్వకాలకు పాల్పడుతున్నారని పిటిషనర్లు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ కు ఫిర్యాదు చేశారు.