: పుట్టిన రోజునాడే పెళ్లి... సల్మాన్ వివాహం.. డిసెంబర్ 27న!
బాలీవుడ్ లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఉన్న సల్మాన్ ఖాన్, తన పుట్టినరోజైన డిసెంబర్ 27నే పెళ్లి చేసుకోనున్నాడని ఓ బాలీవుడ్ వెబ్ సైట్ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. తాను 51వ ఏట అడుగు పెట్టే క్షణాల్లోనే తన రొమేనియన్ ప్రియురాలు లులియా వంటూర్ ను వివాహం చేసుకోనున్నాడని పేర్కొంది. కాగా, తన తల్లికిచ్చిన మాట కోసం సల్మాన్ బ్రహ్మచర్యాన్ని వదలనున్నాడని ఇప్పటికే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక లులియా సైతం సల్మాన్ తల్లి చేతిని పట్టుకుని నడిపిస్తున్న ఫోటోలు, ఎన్నో కార్యక్రమాల్లో సల్మాన్, లులియాలు కలిసి పాల్గొనడంతో వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుంటారని చానాళ్లుగానే గుసగుసలు వస్తున్నాయి. ఈ విషయమై సల్మాన్ కుటుంబం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.