: స‌భ్య‌త్వం కోసం భార‌త్ చేస్తోన్న ప్ర‌య‌త్నాలను మేం అడ్డుకోవ‌ట్లేదు: ఆరోప‌ణ‌ల‌ను తిప్పికొట్టిన చైనా


న్యూక్లియర్‌ సప్లయర్స్ గ్రూప్‌ (ఎన్‌ఎస్‌జీ)లో భార‌త్‌ సభ్యత్వానికి తాము అడ్డుప‌డుతున్నామ‌న్న ఆరోప‌ణల్లో నిజం లేద‌ని చైనా తెలిపింది. భార‌త్‌తో క‌లిసి అణ్వస్త్ర వ్యాప్తి నిరోధానికి ప‌నిచేయ‌డానికి సిద్ధ‌మేన‌ని పేర్కొంది. న్యూక్లియర్‌ సప్లైయర్స్‌ గ్రూప్‌లో సభ్యత్వం పొందాలంటే స‌మ‌స్య‌లు మామూలేన‌ని చెప్పింది. భార‌త్ కు తాము మిత్ర‌దేశ‌మేన‌ని చెప్పింది. ఎన్ఎస్‌జీలో చైనా సహా మొత్తం 49 దేశాలున్నాయ‌ని, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంలో భార‌త్ తో క‌లిసి ప‌నిచేసేందుకు తమకు అభ్యంత‌ర‌మేముంటుంద‌ని చైనా విదేశీ వ్యవహారాల ఉప మంత్రి లియు ఝెన్మిన్ అన్నారు. అన్ని అంశాల్లోనూ చైనా-భార‌త్ మ‌ధ్య ప‌ర‌స్ప‌ర స‌హ‌కారం ఉండాల‌నే తాము కోరుకుంటున్న‌ట్లు తెలిపారు.

  • Loading...

More Telugu News